Zee Cinemalu (5th February)

Thursday,February 04,2021 - 10:12 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణహర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబుసంజన గల్రానినిఖిత తుక్రాల్రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

____________________________________ Brand-babu-zee-cinemalu

బ్రాండ్ బాబు

నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : J.B. డైరెక్టర్ : ప్రభాకర్ P. ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు. అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న వ్యక్తి , పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

______________________________________________

సుప్రీమ్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్ డైరెక్టర్ : అనల్ రావిపూడి ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : మే 5, 2016

సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

_______________________________________ Kandireega-zee-cinemalu-586x293

కందిరీగ

నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని

ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది. 

______________________________________

శతమానం భవతి

నటీనటులు : శర్వానంద్అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్జయసుధనరేష్ఇంద్రజరాజా రవీంద్రహిమజప్రవీణ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్

డైరెక్టర్ : సతీష్ వేగేశ్న

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటిరాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారుఅనేది ఈ సినిమా కథాంశం.

____________________________________

shailaja-reddy-alludu-zee-cinemalu

శైలజారెడ్డి అల్లుడు

నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018

ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.