ZeeCinemalu – Jan 8

Thursday,January 07,2021 - 09:28 by Z_CLU

memu-zee-cinemalu-427x320

మేము నటీనటులు : సూర్య, అమలా పాల్ ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి డైరెక్టర్ : పాండిరాజ్ ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్ రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015 పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

====================== shailaja-reddy-alludu-zee-cinemalu-560x320-560x320

శైలజారెడ్డి అల్లుడు నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్ ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్ డైరెక్టర్ : మారుతి దాసరి ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018 ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ). తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

============================= srimanthudu-zee-cinemalu1-586x293

శ్రీమంతుడు నటీనటులు : మహేష్ బాబు, శృతి హాసన్ ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, సుకన్య, సితార, ముకేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కొరటాల శివ ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్ రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015 కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్ష, ఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనే, ఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకి, తన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..? తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

=========================== rarandoi-veduka-chuddam-రారండోయ్-వేడుక-చూద్దాం-naga-chaitanya-rakul-512x298

రారండోయ్ వేడుక చూద్దాం నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని రిలీజ్ డేట్ : 26 మే 2017 పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

================================ Gulebakavali-గులేబాకావలి-prabhudeva-hansika-zeecinemalu

గులేబాకావలి నటీనటులు - ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు స్టంట్స్: పీటర్ హెయిన్స్ సంగీతం: వివేక్ మెర్విన్ కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్ ఆర్ట్: కదీర్ పాటలు: సామ్రాట్ దర్వకత్వం: కల్యాణ్ నిర్మాత: మల్కాపురం శివకుమార్ బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన సినిమా గులేబకావలి. కల్యాణ్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటి కీలక పాత్రలో కనిపిస్తారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం అక్కడ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగులో అదే పేరుతో విడుదలైంది ఈ సినిమా.

గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. పూర్తిగా కామెడీ ఎలిమెంట్స్ తో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్, హన్సిక గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్స్.

==================

spyder-స్పైడర్-మూవీ-zeecinemalu-480x320 స్పైడర్ నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్ డైరెక్టర్ : A.R. మురుగదాస్ ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017 ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు. అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.