Weekend Release – 3 Movies 3 Types

Thursday,March 11,2021 - 09:36 by Z_CLU

వీకెండ్ ఎట్రాక్షన్ గా, శివరాత్రి కానుకగా ఈరోజు 3 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ 3 సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ కాన్సెప్టులు. అవేంటో చూద్దాం

శ్రీకారం ట్రయిలర్

శ్రీకారం వ్యవసాయం కాన్సెప్ట్ తో వచ్చింది శ్రీకారం సినిమా. శర్వానంద్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వ్యవసాయం ప్రాముఖ్యను, మరీ ముఖ్యంగా చదువుకున్న యువత వ్యవసాయ రంగంలోకి రావాలనే అంశాన్ని టచ్ చేశారు. కిషోర్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది.

జాతిరత్నాలు ట్రయిలర్

జాతిరత్నాలు కంప్లీట్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకుడు. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి, స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించాడు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది.

గాలిసంపత్ ఇక థియేటర్లలోకి వస్తున్న మూడో సినిమా గాలిసంపత్. పైన చెప్పుకున్న 2 సినిమాల జానర్లతో ఏమాత్రం సంబంధం లేని మూవీ ఇది. తండ్రికొడుకుల అనుబంధంతో తెరకెక్కింది ఈ మూవీ. అనీష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు తండ్రికొడుకులుగా నటించారు. స్టార్ డైరక్టర్ అనీల్ రావిపూడి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రజెంటర్ గా వ్యవహరించాడు.

ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ 3 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.