Salaar: Prabhas New Movie With KGF Director Prashanth Neel

Wednesday,December 02,2020 - 05:34 by Z_CLU

యంగ్ రెబల్ స్టార్ Prabhas నుంచి మరో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సలార్ (Salaar) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఫస్ట్ సెట్స్ పైకి వచ్చేది ఈ సినిమానే. అవును.. జనవరి నుంచి సలార్ సెట్స్ పైకి వస్తుందని ప్రభాస్ స్వయంగా ప్రకటించాడు.

నాగఅశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్-ఫిక్షన్ సినిమా ఎనౌన్స్ చేశాడు. ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ అనే మరో పాన్ ఇండియా సినిమా కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ వీటికంటే ముందు సలార్ సినిమా స్టార్ట్ కాబోతోంది.

ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమానే థియేటర్లలోకి వస్తుందని హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు ప్రకటించారు.

మూవీ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ అదిరింది. గన్ పట్టుకొని ఠీవిగా ప్రభాస్ కూర్చున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ Salaar అనే మీనింగ్ ఏంటో తెలుసా.. ఉర్దూలో సలార్ అంటే ధైర్యవంతుడైన నాయకుడు (Brave Leader) అని అర్థం. పర్షియన్, అరబ్బీ భాషల్లో కూడా ఈ పదానికి ఇదే అర్థం.

Also Check - ప్రభాస్ ఆదిపురుష్ ఫుల్ డీటెయిల్స్