Vakeel Saab Release date

Wednesday,December 02,2020 - 12:37 by Z_CLU

పవర్ స్టార్ Pawan Kalyan రీ-ఎంట్రీ ఇస్తున్న'Vakeel Saab' సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను  సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది.

వచ్చే ఏడాది మార్చ్ లో ఉగాది కనుకగా సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట. సంక్రాంతికి టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

పవన్ రీమేక్ సినిమా డీటెయిల్స్

ప్రస్తుతం మిగిలి ఉన్న షూట్ ని ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని చూస్తోంది యూనిట్. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అంజలి , నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నాడు. ఆ తర్వాత రాజస్థాన్ లో జరగనున్న నిహారిక పెళ్లికి ఎటెండ్  అవుతాడు. ఆ తర్వాత వకీల్ సాబ్ మళ్లీ సెట్స్ పైకి వస్తుంది.