Balakrishna-Srivas combination on cards

Wednesday,December 02,2020 - 06:24 by Z_CLU

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో Balakrishna సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకు సంబంధించి కొందరు దర్శకులతో డిస్కస్ చేస్తున్నాడట బాలయ్య.

ఇప్పటికే బాలయ్య నెక్స్ట్ సినిమాకు బి.గోపాల్ తో పాటు పూరి జగన్నాధ్ వంటి దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా లిస్టులోకి శ్రీవాస్ కూడా చేరాడట. తాజాగా శ్రీవాస్ బాలయ్య కి ఒక యాక్షన్ కథ చెప్పి ఒప్పించాడని టాక్.

గతంలో బాలయ్య -శ్రీవాస్ కాంబోలో 'డిక్టేటర్' సినిమా వచ్చింది. ఓ మోస్తరుగా విజయం అందుకుంది. మళ్ళీ అలాంటి పవర్ సబ్జెక్ట్ తోనే ఈ ఇద్దరూ సినిమా చేస్తారని టాక్. త్వరలోనే ఈ కాంబో సినిమా ఎనౌన్స్ కానుందని సమాచారం. మరి బాలయ్యతో రెండోసారి సినిమా చేస్తున్న శ్రీవాస్.. నందమూరి ఫ్యాన్స్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.