Adipurush - రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,November 19,2020 - 09:34 by Z_CLU

Prabhas ప్రస్తుతం చేస్తున్న ”రాధేశ్యామ్” రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కానీ అంతలోనే అతడు చేయబోయే ”ఆదిపురుష్” రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అవును.. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఎనౌన్స్ చేశారు. 2022లో ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కాబోతోంది.

adipurush release date

ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ”Adipurush” సినిమాకు సంబంధించి ఆది నుంచి అన్ని విషయాల్లో జోరు చూపిస్తున్నారు మేకర్స్. సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర్నుంచి చాలా విషయాల్ని చకచకా ఫైనల్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే హీరోయిన్ ఎవరనే అంశంపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

తెలుగు-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా త్రీడీలో తీయబోతున్నారు ”ఆదిపురుష్” సినిమాని. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను డబ్ చేస్తారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు.

Also Check – ఆదిపురుష్ లో అనుష్క ఉందా?