‘KGF 2’ World Television Premiere On August 21st only Zee Telugu

Friday,August 12,2022 - 03:47 by Z_CLU

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన 'KGF చాప్టర్2' ఇప్పుడు బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ రాకీ బాయ్ గా కనిపించి మెస్మరైజ్ చేసి మాస్ ప్లస్ క్లాస్ తేడా లేకుండా ఆడియన్స్ ని  ఫిదా చేసిన ఈ సినిమా థియేటర్స్ లో బిగ్గెస్ట్ అనిపించుకొని ఇప్పుడు టివీలో కూడా అదే రేంజ్ హిట్ అనిపించుకోవడానికి రెడీ అయింది.

ఆగస్ట్ 21న ఆదివారం ఈ సినిమా 'జీ తెలుగు'లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కాబోతుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ లో క్లౌడ్ డైనింగ్ ఏరియాలో గ్రాండ్ గా రివీల్ చేసి ఆడియన్స్ కి ప్రీమియర్ డేట్ చెప్పారు. ప్రెజెంట్ జీ తెలుగు గ్రాండ్ గా ఎనౌన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ టీం సినిమాకు తగ్గట్టుగానే ప్రీమియర్ రిలీజ్ డేట్ ని అంతే గ్రాండియర్ గా అందనంత ఎత్తు నుండి ఎనౌన్స్ చేశారని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.

KGF తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ -ప్రశాంత్ నీల్ కాంబో దానికి మించే కంటెంట్ తో  'KGF2' ని అందించి పాన్ వరల్డ్ లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే , అలాగే యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్ళి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. బిగ్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ ఎక్స్ పీరియన్స్ అందించిన ఈ సినిమాను స్మాల్ స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయడానికి రెడీ అవ్వండి.

[video width="352" height="640" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2022/08/kgf2-world-television-premiere-zeetelugu-august21st-zeecinemalu.mp4"][/video]  
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics