NTR-Trivikram Movie Opening Details

Friday,October 09,2020 - 04:39 by Z_CLU

RRRపై క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ తో షూట్ కూడా స్టార్ట్ అయింది. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా పనులు కూడా ఊపందుకున్నాయి. కుదిరితే ఈ దసరాకే సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడట Trivikram

హారిక-హాసిని బ్యానర్ పై ఈ సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. అయితే RRR లేట్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు కూడా లేటవుతూ వస్తోంది. కాబట్టి కనీసం ఈసారి ఓపెనింగ్ అయినా చేయాలని అనుకుంటున్నారు మేకర్స్.

అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా త్రివిక్రమ్ ఖాళీగా ఉండిపోయాడు. ఓవైపు RRR లేట్ అవుతుందని తెలిసినా కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడం కోసమే వెయిట్ చేస్తూ ఉండిపోయాడు. సో.. త్రివిక్రమ్ కోసమైనా ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే బెటర్ అని భావిస్తున్నారు రాథాకృష్ణ.