త్రివిక్రమ్ శ్రీనివాస్

Wednesday,November 16,2016 - 05:44 by Z_CLU

త్రివిక్రమ్ శ్రీనివాస్ నవంబర్ 7 , 1971  లో జన్మించారు. ‘స్వయం వరం’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమకు మాటల రచయిత గా పరిచయం అయ్యారు. ఈ చిత్రం తరువాత ‘నువ్వే కావాలి’, ‘చిరు నవ్వు తో’  చిత్రాలకు మాటలు అందించారు. ‘చిరు నవ్వుతో’ చిత్రానికి గాను మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం తారువాత ‘నిన్నే ప్రేమిస్తా’,’నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలకు మాటలు అందించారు.’ నువ్వే కావలి’ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం విజయం సాధించి దర్శకుడిగా త్రివిక్రమ్ కు మంచి గుర్తింపు అందించింది.  ఈ చిత్రం తారువాత మళ్లీ మాటల రచయితగా మారి ‘వాసు’,’మన్మధుడు’,’జై చిరంజీవ’ చిత్రాలకు మాటలు అందించారు. ‘అతడు’,’జల్సా’,’ఖలేజా’,’జులాయ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి విజయాలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అందుకొని టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ‘అ ఆ’ చిత్రం తో మరో విజయం అందుకున్నారు. ఇక దర్శకుడిగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా అల వైకుంఠపురములో. బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇంతకుముందు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే.

Born : 7 November 1971

సంబంధిత వార్తలు