RRR Japan Promotions in full swing

Thursday,October 20,2022 - 12:30 by Z_CLU

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర విజయడంకా మోగించి బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న RRR రేపు జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ రిలీజవుతోంది. ఈ సందర్భంగా అక్కడ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ , ఎన్టీఆర్ రాజమౌళి తో కలిసి జపాన్ లో వాలిపోయారు. ప్రస్తుతం అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఈవెంట్స్ లో పాల్గొంటూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.

రాజమౌళి సినిమాలకు జపాన్ లో భారీ మార్కెట్ ఉంది. ఆయన గత సినిమాలన్నీ అక్కడ బాగా పెర్ఫాం చేశాయి. ముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజీ కి అక్కడ బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో బాహుబలి ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని రేంజ్ కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు RRR మీద కూడా అక్కడ భారీ అంచనాలున్నాయి. 'నాటు నాటు' సాంగ్ బాగా రీచ్ అయ్యింది.  సోషల్ మీడియా ద్వారా ఇక్కడ సినిమా చేసిన హంగామా అంతా అక్కడి ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు.

రెండు రోజుల్లో ప్రమోషన్స్ ముగించుకొని ఎన్టీఆర్ -రామ్ చరణ్ లతో రాజమౌళి హైదరాబాద్ కి రానున్నారు. మరి జపాన్ లో RRR బాహుబలి ఫ్రాంచైజీ ని మించి కలెక్ట్ చేస్తుందా ? లేదా ? అనేది ఆసక్తిగా మారింది.