‘Naatu Naatu’ song wins prestigious Golden Globe 2023 award

Wednesday,January 11,2023 - 11:51 by Z_CLU

అందరూ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న Golden Globe 2023 అవార్డ్స్ వేడుకలో 'Naatu Naatu ' సాంగ్ అవార్డు దక్కించుకుంది. మోషన్ పిక్చర్ విభాగం కింద సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వాళ్ళతో పాటు ఇండియన్ సినిమా అభిమనులంతా సోషల్ మీడియాలో RRR టీం ను అభినందిస్తూ గర్వపడుతున్నారు.

ఒక అంతర్జాతీయ వేదికపై ఇండియన్ సినిమాకు దక్కిన ఓ గొప్ప ప్రతిష్టాత్మక గౌరవంగా దీన్ని చెప్పుకోవచ్చు. అవతార్ సృష్టికర్త జేమ్స్ క్యామరూన్ లాంటి దిగ్గజాలు విచ్చేసిన ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్ లో తెలుగు సంగీత దర్శకుడిగా కీరవాణి MM Keeravani  అవార్డు అందుకోవడంతో ప్రాంగణం అంతా చప్పట్లతో హోరెత్తింది. కీరవాణి అవార్డు అందుకున్న క్షణంలో రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ సంతోషానికి అవదుల్లేవ్.

కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ కి చంద్ర బోస్ సాహిత్యం అందించగా ప్రేమ్ రక్షిత మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఈ సాంగ్ లో వేసిన ఎనర్జిటిక్ స్టెప్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేశాయి.

ప్రస్తుతం ఆస్కార్ టార్గెట్ దిశగా రాజమౌళి పట్టుదలతో దేశదేశాలు తిరుగుతూనే ఉన్నారు. జపాన్ తో మొదలుపెట్టి ఇప్పటి లాస్ ఏంగిల్స్ దాకా తన హీరోలను వెంటబెట్టుకుని తిరుగుతున్న తీరు అందరికీ స్ఫూర్తి లాంటిది. త్వరలోనే RRR ఆస్కార్ అవార్డు దక్కితే ఇండియన్ సినిమా అభిమనులంతా మరింత గర్విస్తారు.