జీ సినిమాలు (6th అక్టోబర్)

Thursday,October 05,2017 - 10:00 by Z_CLU

టక్కరి

నటీనటులు : నితిన్, సదా
ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, రఘు బాబు, వేణు మాధవ్, ఆలీ.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : అమ్మ రాజశేఖర్
ప్రొడ్యూసర్ : పరుచూరి శివరామ ప్రసాద్
రిలీజ్ డేట్ : 23 నవంబర్ 2007

ఒక అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడు, ఆ ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? వాటిని ఎలా అధిగమించాడు అనే కథాంశంతో తెరకెక్కిందే ‘టక్కరి’. సదా, నితిన్ జంటగా నటించిన రెండో సినిమా. యాక్షన్ తో పాటు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా, అన్ని సెంటర్ లలో ను సూపర్ హిట్ గా నిలిచింది.


కృష్ణార్జున

హీరోహీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్
నటీనటులు – నాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం – పి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.


అందాల రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

 

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే
హైలెట్.


ఏ మాయ చేశావే

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు
ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : గౌతమ్ వాసుదేవ్ మీనన్
ప్రొడ్యూసర్ : మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్
రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.


పవిత్ర ప్రేమ

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, లైలా
నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం
సంగీతం – కోటి
దర్శకత్వం – ముత్యాల సుబ్బయ్య
విడుదల – 1998, june 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.


పల్నాడు

నటీనటులు : విశాల్, భారతీ రాజా

ఇతర నటీనటులు : లక్ష్మీ మీనన్, సూరి, విక్రాంత్, శరత్ లోహితశ్వ, హరీష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 2 నవంబర్ 2013

విశాల్, విక్రాంత్, లక్ష్మీ మీనన్ నటించిన డ్రామా థ్రిల్లర్ పలనాడు. ఒక చిన్న మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ నడుపుకునే సాధారణ యువకుడి జీవితాన్ని ఒక చిన్న సంఘటన ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే కథాంశంతో తెరకెక్కిందే పలనాడు. ఇమ్మన్ సంగీతం అందించిన ఈ సినిమాకి సుసీంతిరన్ దర్శకత్వం వహించాడు.