షూటింగ్ అప్ డేట్స్

Friday,October 06,2017 - 10:06 by Z_CLU

ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్స్ ఎక్కడున్నారు..? తమ అప్ కమింగ్ మూవీస్ ను స్టేజీకి తీసుకొచ్చారు…? ఈ డీటెయిల్స్ తెలియాలంటే స్టూడియో రౌండప్ పై ఓ లుక్కేద్దాం.

 

వినాయక్- సాయి ధరమ్ తేజ్ మూవీ :

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వి.వి.వినాయక్ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్ పై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైన మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్‌ సీన్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సాయిధరమ్‌తేజ్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ మాటలు అందిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 


రాజా ది గ్రేట్ :

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేసేశాడు. ఇటీవలే కేరళలో జరిగిన సాంగ్ షూటింగ్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసింది యూనిట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవి తేజా సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ నెలాఖరున దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

 

కృష్ణార్జున యుద్ధం :

మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్న నాని ఈ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. మొదటి షెడ్యుల్ హైదరాబాద్ లో జరుపుకున్న ఈ సినిమా తర్వాత పొల్లాచి లో మరో షెడ్యూల్ జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతుంది… యూరప్ లోకేషన్స్ లో నాని – అనుపమ పరమేశ్వరన్ తో పాటు బ్రహ్మాజీ, హేమంత్ మరికొందరు నటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు యూనిట్. వెంకట్ బోయిన్ పల్లి సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ,హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు హిపాప్ తమిళ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

హలో :

ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో ‘హలో’ అనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న అక్కినేని అఖిల్ ఈ సినిమాను ఫినిషింగ్ స్టేజి కి తీసుకొచ్చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలకమైన సీన్స్ చిత్రీకరించిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో మరి కొన్ని మెయిన్ సీన్స్ ను షూట్ చేస్తుంది. అక్టోబర్ నెలాఖరు వరకూ జరగనున్న షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పేసి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న థియేటర్స్ కి తీసుకురాబోతున్నారు మేకర్స్. అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

రాజు గాడు యమాడేంజర్ :

సంజన అనే డెబ్యూ డైరెక్టర్ తో ‘రాజు గాడు యమా డేంజర్’ సినిమా చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సినిమాకు సంబంధించి టోటల్ షూటింగ్ ఫినిష్ చేసేశాడు. ఏ.కె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.