జీ సినిమాలు (నవంబర్ 9th)

Tuesday,November 08,2016 - 08:00 by Z_CLU

prema-vijetha

హీరోహీరోయిన్లు – సురేష్, యమున, హరీష్, రోజా

నటీనటులు – గుమ్మడి, పీఎల్ నారాయణ, కోటశ్రీనివాసరావు, బాబుమోహన్, రమాప్రభ

సంగీతం – ఇళయరాజా

నిర్మాత – డాక్టర్ డి.రామానాయుడు

దర్శకత్వం – కె.సదాశివరావు

విడుదల – 1992

70, 80, 90వ దశకాల్లో సినిమా పాటలు హిట్ అయితే అందులో 90 శాతం పాటలు ఇళయరాజావే ఉండేవి. అలా మూడు దశాబ్దాలకు పైగా సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజు ఇళయరాజా. అలాంటి సంగీత జ్ఞాని స్వరాలు అందించిన సినిమా ప్రేమ విజేత. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికీ జనాల్ని మెప్పిస్తాయి. సురేష్, హరీష్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు కె.సదాశివరావు దర్శకత్వం వహించారు.

    ————————————————————————————

padaharella-vayasu

 

హీరోహీరోయిన్లు – చంద్రమోహన్, శ్రీదేవి

నటీనటులు – మోహన్ బాబు, నిర్మలమ్మ

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల – 1978, ఆగస్ట్ 31

అతిలోకసుందరిని టాలీవుడ్ కు పరిచయం చేసిన సినిమా పదహారేళ్ల వయసు. అప్పటికే తమిళనాట సూపర్ హిట్  అయిన 16-వయతనిళ్లే సినిమాకు  రీమేక్ గా ఇది తెరకెక్కింది. తమిళ్ లో ఈ సినిమాను కె.బాలచందర్ తీశారు. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించారు. రెండు భాషల్లో శ్రీదేవే లీడ్ రోల్ చేశారు. తెలుగు వెర్షన్ లో కమల్ హాసన్ పాత్రను చంద్రమోహన్ పోషించారు. అంతకంటే ముందు కమల్ హాసన్ పోషించిన పాత్రను శోభన్ బాబుకు, శ్రీదేవి క్యారెక్టర్ కోసం జయప్రదను అనుకున్నారు. కానీ వాళ్లిద్దరు బిజీగా ఉండడంతో చంద్రమోహన్-శ్రీదేవి ని ఫిక్స్ చేశారు. ఇక తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు.

చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలెట్. సిరిమల్లెపువ్వా అనే సాంగ్ ఇప్పటికీ హిట్టే. పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ… తెలుగు ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని క్లైమాక్స్ మార్చారు. తమిళ్ క్లయిమాక్స్ లో శ్రీదేవి రైల్వేస్టేషన్ లో ఒంటరిగా మిగిలిపోయినట్టు చూపించారు. కానీ తెలుగు క్లయిమాక్స్ లో మాత్రం చంద్రమోహన్ రాకతో సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఉంటుంది.

—————————————————————————————————–

pavithra-prema

 

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతం – కోటి

దర్శకత్వం – ముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, june 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

————————————————————————————

hero-no-1

హీరోహీరోయిన్లు – సుదీప్, రక్షిత

నటీనటులు – అంబరీష్, నాజర్

సంగీతం – గురుకిరణ్

దర్శకత్వం – MS రమేష్

విడుదల –2003, జులై 25

————————————————————————————

oh-my-friend

హీరోహీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

నటీనటులు – నవదీప్, హన్సిక,

సంగీతం – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

————————————————————————————

varna

హీరోహీరోయిన్లు – ఆర్య, అనుష్క శెట్టి

నటీనటులు – వెంకటేష్ హరినాథన్, అశోక్ కుమార్, పాదు రమన్, సెల్వ

సంగీతం – హరీష్ జయరాజ్

దర్శకత్వం – సెల్వ రాఘవన్

విడుదల – 22 నవంబర్ 2013

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఫాంటసీ సినిమా వర్ణ. ఆర్య, అనుష్క జంటగా నటించిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయింది. సినిమా సినిమాకి మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడే ఆర్య, ఇలాంటి సినిమా చేయాలనుకోవడం నిజంగా సాహసమే. హై ఎండ్ గ్రాఫిక్స్ తో ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా అనుష్క కరియర్ లోను డిఫరెంట్ మూవీ గా నిలిచిపోయింది. హరీష్ జయరాజ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ.