చిన్న సినిమాలే కానీ...

Wednesday,November 09,2016 - 10:10 by Z_CLU

ప్రస్తుతం బడా సిినిమాలేవీ రిలీజ్ కు రెడీగా లేవు. దీంతో చిన్న సినిమాలు లక్ చెక్ చేసుకోబోతున్నాయి. అయితే వీటిలో ఓ రెండు సినిమాలు మాత్రం మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అవి పేరుకు చిన్న సినిమాలే అయినా… అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అవే జయమ్ము నిశ్చయమ్మురా, ద్వారకా సినిమాలు.
capture
‘గీతాంజలి’ చిత్రంతో హిట్ కొట్టిన శ్రీనివాస్ రెడ్డి హీరోగా… పూర్ణిమ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘‘జయమ్ము నిశ్చయమ్మురా’’. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  నవంబర్ 25న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ సూపర్ హిట్ అయింది. పైగా శ్రీనివాసరెడ్డి ఉంటే కామెడీ బాగుంటుందనే బజ్ నడుస్తోంది.
vijay-deverakonda-dwaraka-movie-trailer
ఇక ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న మరో సినిమా ‘ద్వారక’. ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేయడానికి కారణం హీరో విజయ్ దేవరకొండ. ఈ కుర్రాడు ఈమధ్యే పెళ్లిచూపులు సినిమాతో బ్రహ్మాండమైన హిట్ అందుకున్నాడు. అందుకే అతడి నెక్ట్స్ సినిమా ద్వారకపై అందరి చూపు పడింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ ను 10లక్షల మంది చూశారంటే మనోడి క్రేజ్ అర్థంచేసుకోవచ్చు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా.. నవంబర్ చివరి వారంలో విడుదలకానుంది.