జీ సినిమాలు - మే 25

Sunday,May 24,2020 - 08:02 by Z_CLU

హలో
నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్
ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017
చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ
తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా
పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

===============================

బాడీగార్డ్
నటీనటులు : వెంకటేష్, త్రిష, సలోని అశ్వని,
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయ ప్రకాష్ రెడ్డి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2012
వెంకటేష్, త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

===========================

జెర్సీ
నటీనటులు : నాని, శ్రద్ధా దాస్
ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్
డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి
ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి
రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019
అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.
అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.

=====================

ఒకటో నంబర్ కుర్రాడు
నటీనటులు : తారకరత్న, రేఖ
ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : కోదండరామిరెడ్డి
ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002
తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

===========================

రాజా నరసింహా
నటీ నటులు : మమ్ముటీ , జై, జగపతిబాబు, సన్నీలియోన్‌, సలీం కుమార్ తదితరులు.
ఛాయాగ్రహణం : షాజీ కుమార్
సంగీతం : గోపీ సుందర్‌
కథ -స్క్రీన్ ప్లే : ఉదయ్ కృష్ణ
దర్శకత్వం : వైశాక్
సహ నిర్మాత: నూల అశోక్‌
నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ
నిడివి : 150 నిమిషాలు
సెన్సార్ : U/A
విడుదల తేది : 1 జనవరి 2020
కేరళలో కొచ్చిమారుమూల అటవీ ప్రాంతంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా గీరేశం(జగపతి బాబు)
తయారు చేసే కల్తీ మందుతాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా (మమ్ముట్టి). నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. అయితే పాలకొల్లుకు రాజా తన తండ్రి , తమ్ముడు చిన్నా(జై) కోసం ఆ అటవీ ప్రాంతంలో అడుగుపెడతాడు. అలా కొచ్చిలో అడుగుపెట్టిన రాజా గిరీశం చేసే అవినీతిని బయటపెట్టి అక్కడ గిరీశంకి అపోజిట్ గా ఎం.ఎల్.ఏ పదవికి పోటీ చేస్తాడు.
అయితే రాజా తన అవినీతి జీవితానికి అడ్డుతగలడంతో చిన్నాను రాజాకి సహాయం చేసే మరో మహిళను తన వేట కుక్కలచేత చంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రాజా చివరికి గిరీశంను ఎలా అంతమొందించాడనేది సినిమా కథాంశం.

==============================

ఏబీసీడీ
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019
న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.
అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.