జీ సినిమాలు (మార్చి 28)

Friday,March 27,2020 - 09:02 by Z_CLU

కల్యాణ వైభోగమే
నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్
ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియుతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి
డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి
ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 4 మార్చి 2016
నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల
బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా
ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

=======================

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు
సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=========================

శతమానంభవతి
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్
డైరెక్టర్ : సతీష్ వేగేశ్న
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు
(శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా
రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

=========================

స్పైడర్
నటీనటులు : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్య, భరత్, RJ బాలాజీ, ప్రియదర్శి, జయప్రకాష్, సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017

ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివ, ట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు. అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి
రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

==========================

టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్
ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్
డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్
ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018

అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.
కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా
ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.

============================

పండగ చేస్కో
నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : రవి కిరీటి
రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.