రామరాజు వచ్చేశాడు: RRR ఫస్ట్ లుక్

Friday,March 27,2020 - 06:21 by Z_CLU

ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే వేగుచుక్క ఎగబడినట్టుంది. ఎదురుపడితే చావుకైనా చెమట పడతది.

ఈ లైన్స్ చాలు.. RRRలో రామరాజు పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి. చరణ్ పుట్టినరోజు సందర్భంగా రౌద్రం-రణం-రుథిరం సినిమా నుంచి రామరాజు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఇందులో యంగ్ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అదరగొట్టాడు. ఈ వీడియోకు భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద ఎట్రాక్షన్.

ఇప్పటివరకు మనకు తెలిసిన అల్లూరి అంటే చేతిలో బాణం-విల్లు మాత్రమే. కానీ రౌద్రం-రణం-రుథిరంలో మాత్రం ఈ అల్లూరికి సకల విద్యలు తెలుసు. విల్లు పట్టిన చేతితోనే తుపాకి పట్టాడు. అదే చేత్తో బాక్సింగ్, కర్రసాము కూడా చేశాడు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే 1920ల కాలంనాటి ఓ ఫిక్షన్ వారియర్ ఎలా ఉంటాడో చరణ్ ను అలా ప్రజెంట్ చేశాడు రాజమౌళి. వీడియోలో సెంథిల్ ఫ్రేమింగ్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

ఈ ఒక్క వీడియోతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు డబుల్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న థియేటర్లలోకి రాబోతున్నారు రామరాజు-భీమ్.