జీ సినిమాలు - జులై 7

Monday,July 06,2020 - 08:31 by Z_CLU

బుర్రకథ
న‌టీనటులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి
ఇతర నటీనటులు : నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా,
అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు
సంగీతం : సాయికార్తీక్‌
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
రిలీజ్ డేట్: జూన్ 28, 2019
అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు
గురవుతుంటాడు అభిరామ్.
ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).
ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

=============================

బొబ్బిలిరాజా
హీరో హీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి
ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్,
గుమ్మడి
సంగీత దర్శకుడు – ఇళయరాజా
దర్శకుడు – బి.గోపాల్
విడుదల తేదీ – 1990
ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా
పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా, 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై… అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

=========================

ఒక ఊరిలో
నటీనటులు : తరుణ్, రాజా, సలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005
లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=========================

నవ వసంతం
నటీనటులు : తరుణ్, ప్రియమణి
ఇతర నటీనటులు : ఆకాష్,అంకిత, సునీల్, రోహిత్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు ,ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఏ.రాజ్ కుమార్
డైరెక్టర్ : కె.షాజహాన్
ప్రొడ్యూసర్ : ఆర్.బి.చౌదరి
రిలీజ్ డేట్ : 9 నవంబర్ 2007
తరుణ్, ప్రియమణి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు షహజాహాన్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నవ వసంతం‘. అందమైన లవ్ స్టోరీ తో పాటు స్నేహితుల మధ్య అనుబంధాన్ని చాటి చెప్పే కథ తో సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా సూపర్ గుడ్ ఫిలిం గా అందరినీ ఆకట్టుకొని అలరిస్తుంది. తరుణ్ ప్రియమణి మధ్య వచ్చే లవ్ సీన్స్, తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఎస్.ఏ. రాజ్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్స్…

============================

ఓకే ఓకే
హీరో హీరోయిన్లు – ఉదయనిధి స్టాలిన్, హన్సిక
ఇతర నటీనటులు – శరణ్య, సంతానం
సంగీతం – హరీష్ జైరాజ్
దర్శకత్వం – ఎమ్.రాజేష్
విడుదల తేదీ – 2012, ఆగస్ట్ 31
తమిళనాట భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా మారి చేసిన మొట్టమొదటి చిత్రం ఓకే ఓకే. బాగా డబ్బు ఉంది. తలచుకుంటే ఎలాంటి డైరక్టర్ ను అయినా ఒప్పించి ఓ మాస్ మసాలా భారీ బడ్జెట్ సినిమా చేయగలడు ఉదయ్ నిధి స్టాలిన్. కానీ కథపై నమ్మకంతో.. తనే నిర్మాతగా ఉంటూ, హీరోగా మారి ఓ కామెడీ రొమాంటిక్ సినిమాతో అరంగేట్రం చేశాడు. ఉదయ్ నిధి స్టాలిన్ నమ్మకం వమ్ముపోలేదు. ఓకే ఓకే సినిమా తమిళనాట బ్రహ్మాండంగా ఆడింది. 2012 సూపర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. హన్సిక అందాలు ఈ సినిమాకు ఒక ఎత్తయితే… ఉదయ్-సంతానం కలిసి పండించిన కామెడీ సినిమాకు బ్యాక్ బోన్. అటు హరీష్ జైరాస్ కూడా తన సంగీతంతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు.

=================================

సైనికుడు
నటీనటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ : అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 డిసెంబర్ 2006
మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.