పవన్-చరణ్ కాంబినేషన్ లో సినిమా

Monday,July 06,2020 - 04:02 by Z_CLU

ఈ కాంబినేషన్ పై డిస్కషన్ ఇప్పటిది కాదు. పవన్ కల్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రావాల్సి ఉంది. ఈ విషయాన్ని చరణ్ కూడా చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు ఈ ప్రాజెక్టు సెట్ అయ్యేలా కనిపిస్తోంది. RRR తర్వాత పవన్ బ్యానర్ పై చరణ్ సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు చాలామంది.

ప్రస్తుతం చరణ్ లిస్ట్ లో చాలామంది దర్శకులున్నారు. త్రివిక్రమ్ లాంటి బడా డైరక్టర్ పేరు నుంచి సతీష్ లాంటి ఓ కొత్త డైరక్టర్ పేరు వరకు చాలామంది ఉన్నారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై చరణ్ హీరోగా చేయబోయే సినిమాకు వీళ్లలో ఎవరు డైరక్టర్ అనేది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఓవైపు వీటిని పూర్తిచేస్తూనే, మరోవైపు నిర్మాతగా చరణ్ తో సినిమాను పట్టాలపైకి తీసుకురావాలని పవన్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడట.