జీ సినిమాలు (జనవరి 3)

Monday,January 02,2017 - 10:30 by Z_CLU

soundarya-chandramukhi

 

హీరోహీరోయిన్లు – విష్ణువర్థన్, సౌందర్య

నటీనటులు – రమేష్ అరవింద్, ప్రేమ,

సంగీతం – గురుకిరణ్

స్క్రీన్ ప్లే – దర్శకత్వం –  పి.వాసు

విడుదల తేదీ – 2005

కన్నడలో సూపర్ హిట్ అయిన ఆప్తమిత్ర సినిమాను సౌందర్య చంద్రముఖి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా కేవలం శాండిల్ వుడ్ లోనే కాదు… టోటల్ సౌత్ లోనే సూపర్ సెన్సేషనల్ హిట్ అయింది. నిజానికి 1993లో వచ్చిన మలయాళం సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. మలయాళంలో మోహన్ లాల్, శోభన కీలకపాత్రలు పోషిస్తే… కన్నడలో విష్ణువర్థన్, సౌందర్య నటించారు. తర్వాత ఇదే సినిమాను తమిళ్ లో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలుగా తెరకెక్కించారు. తర్వాత ఇది బుల్ బులయా పేరుతో హిందీలో కూడా రీమేక్ అయింది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా… కథలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుందని నిరూపించింది సౌందర్య చంద్రముఖి సినిమా. అన్ని భాషల్లో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కెరీర్ ను మళ్లీ స్వింగ్ లోకి తీసుకొచ్చిన మూవీ కూడా ఇదే కావడం విశేషం. అంతేకాదు… సౌందర్య నటించిన చివరి చిత్రం కూడా ఇదే.

——————————————————————

chaduvukunna-ammayilu-1

 

హీరోహీరోయిన్లు – ఏఎన్నార్, సావిత్రి

నటీనటులు – కృష్ణకుమారి, రేలంగి, గుమ్మడి, పద్మనాభం

సంగీతం – సాలూరి రాజేశ్వరరావు

నిర్మాత – దుక్కిపాటి మధుసూధనరావు

దర్శకత్వం – ఆదుర్తి సుబ్బారావు

విడుదల – 1963

అప్పటికే ప్రయోగాలకు పెట్టిందిపేరుగా ఆదుర్తి పేరు సంపాదించుకున్నారు. కథలు ఇలాగే ఎందుకుండాలి… సన్నివేశాలు ఇలానే ఎందుకు తీయాలి… భావోద్యేగాలు రొటీన్ గానే కనిపించాలా… అంటూ ప్రశ్నించిన మొదటితరం టెక్నీషియన్లలలో ఆదుర్తి ముందుంటారు. తన కెరీర్ ను కూడా అంతే కొత్తగా కొనసాగించిన ఆదుర్తి… చదువుకున్న అమ్మాయిలు సినిమాతో కూడా ప్రయోగమే చేశారని చెప్పాలి. కాలాతీత వ్యక్తులు అనే నవలను సినిమాగా తీయాలనే ఆలోచన కూడా రాని రోజుల్లో… ఆ నవలతో సినిమా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆదుర్తి మీద నమ్మకంతో అక్కినేని కాల్షీట్లు ఇచ్చారు. అక్కినేని చేరారు కాబట్టి సావిత్రి కూడా ఒప్పుకున్నారు. అక్కినేని-సావిత్రి నటిస్తున్నారు కాబట్టి మిగతా నటీనటులు, టెక్నీషియన్లలు కూడా కుదిరిపోయారు. అలా అతితక్కువ కాలంలోనే చదువుకున్న అమ్మాయిలు సినిమాగా రూపుదిద్దుకుంది కాలాతీత వ్యక్తులు సినిమా. సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. వినిపించని రాగాలే, కిలకిల నవ్వులు లాంటి పాటలు వింటే మనసు మేఘాల్లో తేలిపోతుంది.

——————————————————————

vinayakudu

 

నటీనటులు – కృష్ణుడు, సోనియా

ఇతర నటీనటులు – సూర్య తేజ్, పూనమ్ కౌర్, సామ్రాట్, అంకిత, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – సామ్ ప్రసన్

నిర్మాత – ప్రేమ్ కుమార్ పట్రా

దర్శకత్వం – సాయి కిరణ్ అడివి

విడుదల తేదీ – 21 నవంబర్ 2008

కృష్ణుడు-సోనియా జంటగా సాయి కిరణ్ అడివి తెరకెకెక్కించిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినాయకుడు’. అప్పటి వరకూ నటుడిగా కొనసాగుతున్న కృష్ణుడు ని హీరోగా చూపించి దర్శకుడు సాయి కిరణ్ రూపొందించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ సాఫ్ట్ స్క్రీన్ ప్లే, సాఫ్ట్ సీన్స్ తో అందరినీ అలరిస్తుంది.

——————————————————————

hanumanthu

 

నటీ నటులు : శ్రీహరి, మధు శర్మ, KR విజయ

ఇతర నటీనటులు : విజయ్ చందర్, రంగనాథ్, ప్రదీప్ రావత్, పింకీ సర్కార్, మానస, దేవి శ్రీ, LB శ్రీ రామ్, కొండవలస, వేణు మాధవ్, కోవై సరళ

మ్యూజిక్ డైరెక్టర్ : వందేమాతరం శ్రీనివాస్

డైరెక్టర్ : చంద్ర మహేష్

ప్రొడ్యూసర్ : శాంత కుమారి

శ్రీహరి హీరోగా తెరకెక్కిన హనుమంతు డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన పక్కా హిట్ ఫార్ములా తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్. పల్లెటూరిలో ఉండే ఒక సాధారణ వ్యక్తి, తన గతం తెలుసుకుని, తన తండ్రి చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పి, సగంలోనే సమసిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం కోసం పోరాడే కొడుకుగా, ఫ్లాష్ బ్యాక్ లో స్వాన్త్రం కోసం పోరాడే యోధుడిగా అద్భుతంగా నటించాడు శ్రీహరి. ఈ సినిమాకి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ప్రాణం.

——————————————————————

bhale-dongalu

 

నటీనటులు – తరుణ్, ఇలియానా

ఇతర నటీనటులు – జగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాత – శాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం – విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11 ఏప్రిల్ 2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా ‘భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

——————————————————————

bhayya

 

నటీ నటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

——————————————————————

poratam

నటీ నటులు : సూర్య, జ్యోతిక

ఇతర నటీనటులు: రఘువరన్, శివ కుమార్, రాధిక, బాలాజీ, కణల్ కన్నన్

మ్యూజిక్ డైరెక్టర్ : దేవ

డైరెక్టర్ : K.R.జయ

ప్రొడ్యూసర్ : ముత్తం శివకుమార్

రిలీజ్ డేట్ : 29 September 2000

సూర్య, జ్యోతిక జంటగా నటించిన ‘పోరాటం’ పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇద్దరన్నాదమ్ముల మధ్య చిన్నగా మొదలైన అసూయ చివరికి ఎటు దారి తీసింది…? ఇద్దరిలో చిన్నవాడైన సూర్య ఏం చేసి అన్న ఆలోచనా విధానాన్ని మార్చాడు అన్నదే ప్రధాన కథాంశం.