ఎన్టీఆర్, కొరటాల మధ్య చర్చలు

Sunday,December 04,2016 - 09:32 by Z_CLU

అదేంటి కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మళ్ళీ నటిస్తున్నాడా? కొరటాల శివ, మహేష్ తో సినిమా చేయబోతున్నాడు కదా. అనుకుంటున్నారా? అవును కొరటాల శివను ఎన్టీఆర్ రెగ్యులర్ గా కలుస్తూ డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈ చర్చలు కొరటాల శివతో తన నెక్ట్  సినిమా చేసేందుకు మాత్రం కాదు.
koratala-siva-ntr-at-wedding
మేటర్ ఏంటంటే… కొరటాల శివ మాస్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ రాయడంలోనే కాదు ప్రేక్షకుల పల్స్ తెలిసిన రచయిత కూడా. ఈ విషయం ఆయన డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు రుజువు చేశాయి. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కన్ను కొరటాలపై పడింది. రచయితలను ఎక్కవగా కలుస్తూ వారితో ఎక్కువగా చర్చించడం ఎన్టీఆర్ కు అలవాటు. అందులో భాగంగానే తనకు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివను రెగ్యులర్ గా కలుస్తూ తన నెక్స్ట్ సినిమా కథ గురించి, సీన్స్ గురించి చర్చిస్తూ సలహాలు, సూచనలు అందుకుంటున్నాడట. తాజాగా ప్రయివేట్ ఫంక్షన్స్ కి కూడా కొరటాలతో కలిసి అటెండ్ అవుతున్నాడట ఎన్టీఆర్. అలా కొరటాల-ఎన్టీఆర్ మధ్య చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయట. ఈ చర్చలన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ప్రకటన ఉంటుందట.