జీ సినిమాలు ( డిసెంబర్ 14th )

Tuesday,December 13,2016 - 09:30 by Z_CLU

jathara-chiranjeevi

నటీనటులు : చిరంజీవి, శ్రీధర్, సువర్ణ

ఇతర నటీనటులు : నాగభూషణం, మాడా, ప్రసాద్ బాబు, హరిబాబు, P.L.నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.K. వెంకటేష్

డైరెక్టర్ :  ధవళ సత్యం

ప్రొడ్యూసర్ : R.S. రామరాజు

రిలీజ్ డేట్ : 1980

మెగాస్టార్ తన కరియర్ బిగినింగ్ లో ధవళ సత్యం డైరెక్షన్ లో చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ జాతర. G.K. వెంకటేష్ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలెట్.

——————————————————————

pilla-zamindar
నటీ నటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

——————————————————————

chakram
నటీనటులు : ప్రభాస్, అసిన్, ఛార్మి కౌర్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, రాధా కుమారి, నారాయణ రావు, కల్పన, పద్మనాభం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : వెంకట రాజు, శివ రాజు
రిలీజ్  డేట్ : 25 మార్చి 2005

ప్రభాస్ హీరోగా నటించిన ‘చక్రం’ అటు ప్రభాస్ కరియర్ లోను ఇటు డైరెక్టర్ కృష్ణవంశీ కరియర్ లోను చాల స్పెషల్ మూవీస్. ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆసిన్, ఛార్మి లు హీరోయిన్ లుగా నటించారు. లైఫ్ ఉన్నంత కాలం నవ్వుతూ బ్రతకాలనే మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చక్రం. చక్రి అందించిన సంగీతం సినిమాకే హైలెట్.

——————————————————————

pedda-manushulu

హీరోహీరోయిన్లు – సుమన్, రచన, హీరా
నటీనటులు – ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, కోటశ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ
సంగీతం – ఈశ్వర్
దర్శకత్వం – బోయిన సుబ్బారావు
నిర్మాత – డి. రామానాయుడు
విడుదల – 1999, జనవరి 13

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పడంతో పాటు… ఆలుమగల మధ్య మాట పట్టింపులు, అనుమానాలు వస్తే కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమైపోతాయో చాటిచెప్పిన చిత్రమే పెద్ద మనుషులు. సినిమా మొత్తం సుమన్ చుట్టూనే తిరిగినప్పటికీ… పెద్దమనుషులుగా కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు తన నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచాడు. ఈ సినిమాతోనే ఈశ్వర్… సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

——————————————————————

brahma-putrudu

నటీనటులు : వెంకటేష్, రజని
ఇతర నటీనటులు : మోహన్ బాబు, జయసుధ, నూతన ప్రసాద్, శ్రీ దివ్య, బేబీ శాలిని, అల్లు రామలింగయ్య తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి
డైరెక్టర్ : దాసరి నారాయణ రావు
ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు
రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1988

1988 లో రిలీజైన బ్రహ్మపుత్రుడు తో వెంకటేష్ ని మాస్ హీరోల లిస్టులోకి చేర్చేసింది. తమిళం లో రీమేక్ అయిన మైకేల్ రాజ్ కి రీమేక్ ఈ సినిమా. వెంకటేష్ ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమాని దాసరి నారాయణ రావు గారు తెరకెక్కించారు.

——————————————————————

okka-magadu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : Y.V.S.చౌదరి
ప్రొడ్యూసర్ : Y.V.S.చౌదరి
రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.