దర్శకుడిగా మారిన మెగా స్టార్...

Tuesday,December 13,2016 - 07:16 by Z_CLU

ఓ స్టార్ హీరో ను కెప్టెన్ చైర్ లో కూర్చొని డైరెక్ట్ చేయడం రొటీన్ అదే ఓ స్టార్ హీరో ఆ చైర్ లో కూర్చొని ఓ స్టార్ డైరెక్టర్ ను డైరెక్ట్ చేస్తే ఇది డిఫరెంట్ కదా. ఇలాంటి సీనే లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ సెట్ లో చోటు చేసుకుంది. ఈ రోజు జరిగిన షూటింగ్ లో డైరెక్టర్ వినాయక్ ఓ చిన్న షాట్ లో నటించాడట. చిరంజీవి 150 వ సినిమా కావడం పైగా ఈ మధ్య డైరెక్టర్స్ కూడా ఏదో ఓ చిన్న షాట్ లో కనిపించడం కామన్ అయిపోవడం తో వినాయక్ కూడా ముచ్చపడి ఓ సీన్ లో నటించాడట.

mega-star-chiru-vinayak
ఈ రోజు సారధి స్టూడియోస్ లో జరిగిన ఈ సీన్ ను స్వయంగా కెప్టెన్ చైర్ లో కూర్చొని మెగా ఫోన్ చేతిలో పట్టుకొని మరీ మెగా స్టారే డైరెక్ట్ చేశారట. ఈ సీన్ జరుగుతున్నంత సేపు సెట్లో కాస్త సందడి నెలకొందట. యూనిట్ అందరు అరుపులతో చిరు ను డైరెక్టర్ గా ఉత్సాహ పరిచారట. ఈ సీన్ తో నటుడిగా వినాయక్, డైరెక్టర్ గా చిరు వారి వారి సరదాలను తీర్చుకొని సంతోష పడ్డారట..

vinayak

 

 

అయితే ఈ సీన్ లో వినాయక్ నటించడానికి ఓ సెంటిమెంట్ కూడా రీజన్ కావొచ్చు. గతం లో మెగా స్టార్ హీరోగా ‘ఠాగూర్’ సినిమాను డైరెక్ట్ చేసిన వినాయక్ ఆ సినిమాలో ఓ అత్యంత కీలక మైన క్యారెక్టర్ ను ఎవ్వరికీ ఇవ్వకుండా తనే నటించి నటుడిగా మంచి మార్కులు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఓ కీలకమైన క్యారెక్టర్ నే ‘ఖైదీ నంబర్ 150 ‘లో చేసాడనే టాక్ వినిపిస్తుంది.