నితిన్ దారిలో శర్వానంద్...

Wednesday,December 14,2016 - 10:46 by Z_CLU

ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు వరుస హిట్స్ తో ఊపుమీదున్నారు. ఎవరి సినిమాలు వారివి, ఎవరి లెక్కలు వారివి. కానీ ఒక్క విషయంలో మాత్రం నితిన్ ను యాజ్ ఇటీజ్ ఫాలో అయిపోతున్నాడు శర్వానంద్. నితిన్ లా తను కుడా రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. రేపే ఆ రెస్టారెంట్ ప్రారంభం.

ఫుడ్ బిజినెస్ లోకి ఇప్పటికే ఎంటరయ్యాడు నితిన్. హైదరాబాద్ లో ఓ పెద్ద రెస్టారెంట్ ప్రారంభించాడు. హీరోయిన్ సమంత ఆ రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు శర్వానంద్ కూడా.. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్-10లో ఈ రెస్టారెంట్ ఉంది.