జీ సినిమాలు - ఆగస్ట్ 13

Wednesday,August 12,2020 - 11:02 by Z_CLU

సుబ్రమణ్యపురం
నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : సురేష్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఆలీ, సురేష్, జోష్ రవి, భద్రం గిరి, మాధవి,
హర్షిని, TNR తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి
ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో
సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

==============================

బలాదూర్
నటీనటులు : రవితేజ, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : కృష్ణ, చంద్ర మోహన్, ప్రదీప్ రావత్, సునీల్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : K.M. రాధాకృష్ణన్
డైరెక్టర్ : K.R. ఉదయ శంకర్
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2008
బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు చంటి. అందుకే అస్తమానం తండ్రితో మాటలు పడుతుంటాడు. అలాంటప్పుడు కూడా చంటి పెదనాన్న రామకృష్ణ చంటికి సపోర్టివ్ గా ఉంటాడు. అందుకే చంటికి పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఇదిలా ఉంటే ఉమాపతి రామకృష్ణని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయలని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు చంటి ఏం చేస్తాడు..? ఎలా తన కుటుంబాన్ని… రామక్రిష్ణని కాపాడుకుంటాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================

రారండోయ్ వేడుకచూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

=================================

శివాజీ
నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్
ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : S.శంకర్
ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్
రిలీజ్ డేట్ : 15 జూన్ 2007
ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

================================

సాక్ష్యం
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, ఆశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వర్
డైరెక్టర్ : శ్రీవాస్
ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
స్వస్తిక్ నగరంలో ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా, ఊరికి పెద్దగా ఉంటాడు రాజు గారు (శరత్ కుమార్). అదే ఊరిలో ఉంటూ తన తమ్ముళ్ళతో కలిసి అన్యాయాలకు, అక్రమాలకూ కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తాడు మునిస్వామి(జగపతిబాబు). తను చేసే ప్రతీ పనికి ఎదురు రావడంతో తన ముగ్గురు తమ్ముళ్ళు(రవి కిషన్, అశుతోష్ రానా)లతో కలిసి సాక్ష్యాలు లేకుండా రాజు గారు కుటుంబాన్ని మొత్తం హత్య చేస్తాడు ముని స్వామి. కానీ ఒక్క వారసుడు మాత్రం తప్పించుకుని చివరికి న్యూయార్క్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త శివ ప్రకాష్ (జయప్రకాష్)వద్ద విశ్వాజ్ఞ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్)గా పెరిగి పెద్దవుతాడు.
అలా ఓ పెద్ద వ్యాపారవేత్త కొడుకుగా వీడియో గేమ్ డెవలపర్ గా జీవితాన్ని కొనసాగించే విశ్వజ్ఞ ఓ సందర్భంలో ఇండియా నుండి న్యూయార్క్ వచ్చిన సౌందర్య లహరి(పూజా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. పురాణాలు, ఇతిహాసాల మీదుగా ఆసక్తి ఉన్న సౌందర్యలహరి దగ్గర చాలా విషయాలు తెలుసుకుంటాడు. హఠాత్తుగా తన తండ్రి గురించి ఇండియాకి వెళ్ళిన సౌందర్య ను వెతుక్కుంటూ ఇండియాలో అడుగుపెడతాడు విశ్వాజ్ఞ.
ఇండియా వచ్చాక విశ్వ తనకు తెలియని వ్యక్తుల చావులకు కారణం అవుతాడు.. చంపే వాడికి చచ్చే వాడెవరో తెలియదు… చచ్చే వాడికి చంపెదేవరో తెలియదు విధి ఆడే ఈ ఆటలో ఏం జరిగింది… చివరికి తన కుటుంబాన్ని దారుణంగా చంపిన ముని స్వామీ ను అతని తమ్ముళ్ళను విస్వా ఎలా అంతమొందించాడు.. అనేది కథ.

=============================

ఏబీసీడీ
నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్
ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ
డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
రిలీజ్ డేట్ : 17th మే 2019
న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు.
అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.