జీ సినిమాలు (5 మార్చ్ 2018)

Sunday,March 04,2018 - 10:00 by Z_CLU

వినాయకుడు

నటీనటులు – కృష్ణుడు, సోనియా

ఇతర నటీనటులు – సూర్య తేజ్, పూనమ్ కౌర్, సామ్రాట్, అంకిత, ఆదర్శ్ బాలకృష్ణ, సత్య కృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ – సామ్ ప్రసన్

నిర్మాత – ప్రేమ్ కుమార్ పట్రా

దర్శకత్వం – సాయి కిరణ్ అడివి

విడుదల తేదీ – 21 నవంబర్ 2008

కృష్ణుడు-సోనియా జంటగా సాయి కిరణ్ అడివి తెరకెకెక్కించిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ ‘వినాయకుడు’. అప్పటి వరకూ నటుడిగా కొనసాగుతున్న కృష్ణుడు ని హీరోగా చూపించి దర్శకుడు సాయి కిరణ్ రూపొందించిన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ సాఫ్ట్ స్క్రీన్ ప్లే, సాఫ్ట్ సీన్స్ తో అందరినీ అలరిస్తుంది.

===================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని
ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్
మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు
డైరెక్టర్ : జంధ్యాల
ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది. ========================================================

గీతాంజలి 

నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి
ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్ : కోన వెంకట్
రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

========================================================

విక్టరీ

హీరోహీరోయిన్లు – నితిన్, మమతా మోహన్ దాస్
నటీనటులు – సింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ
సంగీతం – చక్రి
బ్యానర్ – ఆర్.ఆర్. మూవీ మేకర్స్
దర్శకత్వం – రవి. సి. కుమార్
విడుదల – 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

====================================================

బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహ ఒబెరాయ్

నటీ నటులు : గుల్షన్,సుమన్, జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు

సంగీతం : మణిశర్మ

నిర్మాణం  : వైజయంతి మూవీస్

నిర్మాత : అశ్విని దత్

దర్శకత్వం : కరుణాకరన్

విడుదల తేది : 6 జనవరి  2015

 

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగోట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

========================================================

సైనికుడు

నటీ నటులు : మహేష్ బాబు, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఇర్ఫాన్ ఖాన్, కామ్న జెఠ్మలాని, కోట శ్రీనివాస రావు, రవి వర్మ అజయ్
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ : అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 డిసెంబర్ 2006

మహేష్ బాబు కరియర్ లో సైనికుడు సినిమా ప్రత్యేకమైనది. రాజకీయ అవినీతి పరులపై ఒక యువకుడు చేసిన పోరాటమే సైనికుడు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు. త్రిష అమాయకత్వపు నటన సినిమాకే హైలెట్. హారిస్ జయరాజ్ ప్రతి పాట బావుంటుంది.