నాగ్-నాని మల్టీ స్టారర్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Sunday,March 04,2018 - 03:02 by Z_CLU

 శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున నాని హీరోలుగా తెరకెక్కనున్న మల్టీ స్టారర్ సినిమా ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి రానుంది. ఇటివలే ఈ సినిమాకు సంబంధించి పాటల రికార్డింగ్ ప్రారంభించిన యూనిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో నాని సరసన రకుల్ ని ఫైనల్ చేసారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుండగా లేటెస్ట్ గా ఈ భామనే ఫిక్స్ చేసారని తెలుస్తుంది. ఇటివలే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రకుల్ కి స్క్రిప్ట్ వినిపించాడని, స్క్రిప్ట్ నచ్చడంతో  రకుల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుందని సమాచారం. ఇక త్వరలోనే నాగ్ కి కూడా హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట యూనిట్.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. సంక్రాంతి కి సినిమాను విడుదల చేసే ప్లాన్ ఓ ఉన్నారు మేకర్స్.