జీ సినిమాలు ( 17th డిసెంబర్ )

Saturday,December 16,2017 - 10:46 by Z_CLU

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన ఐశ్వర్య షిందోగి, మదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ : లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

===========================================================================

అందాల  రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

============================================================================

మగ మహారాజు

నటీనటులు : విశాల్, హన్సిక
ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సుందర్ C.
ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.

============================================================================

ఆట

నటీనటులు : సిద్ధార్థ్ నారాయణ్, ఇలియానా డిక్రూజ్

ఇతర నటీనటులు : మున్నా, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, సాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనురాధా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : V.N.ఆదిత్య

ప్రొడ్యూసర్ : M.S. రాజు

రిలీజ్ డేట్ : 9 మే 2007

చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన శ్రీకృష్ణ, తన లైఫ్ ని కూడా హీరోలా లీడ్ చేయాలనుకుంటాడు. అంతలో సత్యతో ప్రేమలో పడిన శ్రీకృష్ణ ఆ తరవాత తన లైఫ్ లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కున్నాడు…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాకి DSP మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.