
నటీ నటులు : ఉదయ్ కిరణ్, దివ్య
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముమైత్ ఖాన్, నిగళ్ గళ్ రవి, సత్య రాజ్, రఘుబాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. లక్ష్మణ్
డైరెక్టర్ : రాజ్ కపూర్
ప్రొడ్యూసర్ : పొలిశెట్టి రామ్ బాబు
రిలీజ్ డేట్ : 29 ఫిబ్రవరి 2008
ఉదయ కిరణ్ చేసిన సినిమాల్లో ప్రేమ కథలే ఎక్కువ. లవర్ బాయ్ ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న టైం లో ఫాదర్ సెంటిమెంట్ తో చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ లక్ష్మీ పుత్రుడు. మతి స్థిమితం తప్పిన తన తండ్రి కోసం, హీరో ఏం చేశాడన్నదే ప్రధాన కథాంశం.
==============================================================================

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా
ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : N. శంకర్
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 30 మార్చి 2006
అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.
=============================================================================

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి
మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్
డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.
==============================================================================

నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య
ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్
డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు
ప్రొడ్యూసర్ : D. సురేష్
రిలీజ్ డేట్ : 23 జూన్ 1994
ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆసిదేంట్ వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.
===============================================

హీరో హీరోయిన్స్ : విశాల్,లక్ష్మి మీనన్
ఇతర నటీ నటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు
సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్
నిర్మాత : విశాల్. రోన్ని,సిద్దార్థ్
దర్శకత్వం : తిరు
విశాల్- లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిసార్డర్ తో భాధ పడే ఓ యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్ , లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్…
=============================================================================

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల
రిలీజ్ డేట్ : 12 జనవరి 2011
రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.
=============================================================================

నటీనటులు : జీవా, సంధ్య
ఇతర నటీనటులు: గిన్నిస్ ఫక్రు, నాజర్, అనీ మాళవిక, SJ సూర్య, విశాల్
మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని
డైరెక్టర్ : శశి
ప్రొడ్యూసర్ : విశ్వనాథన్, రవిచంద్రన్
రిలీజ్ డేట్ : 2 ఫిబ్రవరి 2006
రెండు విభిన్న మనస్తత్వాలు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో అతి సున్నితంగా చెప్పిన సినిమా డిష్యుం డిష్యుం. ఈ సినిమాలో జీవా స్టంట్ మాస్టర్ అయితే హీరోయిన్ గా నటించిన సంధ్య ఆర్ట్స్ స్టూడెంట్. వీరి ప్రేమ కథ ఎలా మొదలవుతుంది. ఎలాంటి మలుపులు తిరిగుతుందనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.