బాహుబలి-2 ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్?

Friday,March 10,2017 - 06:48 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ బాహుబలి-2 సినిమాకు సంబంధించి ఒక్కో డేట్ ను ఫిక్స్ చేస్తూ వస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఎనౌన్స్ చేసిన జక్కన్న, ఈమధ్యే ట్రయిలర్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించాడు. తాజాగా ఆడియో  రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 25న బాహుబలి-2 పాటల వేడుకను ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన మాహిష్మతి సెట్ లోనే ఈ ఆడియో ఫంక్షన్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

బాహుబలి-2 సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చేనెల 28న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈనెల 15న ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను ముంబయిలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన స్టార్స్ కొందరు ఈ ఈవెంట్ కు హాజరుకాబోతున్నారు. హిందీలో బాహుబలి ప్రజెంటర్ కరణ్ జోహార్.. ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.