జీ సినిమాలు ( ఫిబ్రవరి 11th)

Friday,February 10,2017 - 10:08 by Z_CLU

indrudu-chandrudu

నటీ నటులు : కమల హాసన్, విజయశాంతి

ఇతర నటీనటులు : శ్రీ విద్య, నగేష్, చరణ్ రాజ్, జయలలిత, P.L.నారాయణ, గొల్లపూడి మారుతి రావు, E.V.V. సత్యనారాయణ. 

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 నవంబర్ 1989

విలక్షణ నటుడు కమల హాసన్ కరియర్ లో ఇంద్రుడు చంద్రుడు సినిమాది ప్రత్యేక స్థానం. ఒక సాధారణ యువకుడిగా, కరప్టెడ్ మేయర్ గా కమల హాసన్ నటించిన తీరు సినిమాకే హైలెట్. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని రామా నాయుడు గారు నిర్మించారు. ఇళయరాజా సంగీతం సినిమాకి మరో ఎసెట్.

=============================================================================

అడవిలో అన్వేషణ

నటీనటులు : K.R.విజయ, శరత్ బాబు 

==============================================================================

 surigadu-zee-cinemalu

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ఒకే ఒక ఆశఅంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

 ===============================================

ahanapellanta-rajendra-prasad

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

=============================================================================

maga-maharaju

నటీనటులు : విశాల్, హన్సిక

ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సుందర్ C.

ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.

============================================================================

krishna

నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.

==============================================================================

ji-jee

నటీనటులు : అజిత్ కుమార్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : చరణ్ రాజ్, విజయ కుమార్, మణి వన్నన్, విసు, వినోద్ అల్వా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : S.S. చక్రవర్తి

రిలీజ్ డేట్ : 11 ఫిబ్రవరి 2005

అజిత్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన ‘జి’ పర్ ఫెక్ట్ యూత్ యాక్షన్ ఎంటర్ టైనర్. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ డ్రామాని లింగుస్వామి సూపర్బ్ గా తెరకెక్కించాడు. విద్యా సాగర్ అందించిన మ్యూజిక్, యాక్షన్ సీన్స్ సినిమాకి హైలెట్.