ఓవర్సీస్ లో సింగం-3 హంగామా

Friday,February 10,2017 - 07:12 by Z_CLU

సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సింగం-3 వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. పలుమార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాకు గ్రేట్ రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అటు తమిళ ఆడియన్స్ తో పాటు.. తెలుగు ప్రేక్షకులు కూడా థియేటర్ల ముందు క్యూ కట్టడంతో విదేశాల్లో సింగం-3 సునామీ స్టార్టయింది. ఒక్క గురువాారం రోజే అమెరికాలో ఈ సినిమాకు 39వేల డాలర్లు వచ్చాయి. ఇక మొత్తం కలెక్షన్ చూస్తే… 83వేల డాలర్లు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో కలుపుకొని ఈ కలెక్షన్లు సాధించింది సింగం-3 సినిమా. వీకెండ్ స్టార్ట్ అయిన మొదటి రోజే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సూర్య పవర్ ఫుల్ పోలీస్ గాా నటించిన ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూశారు. తొలి రెండు భాగాలు సూపర్ హిట్ అవ్వడంతో, పార్ట్-3పై భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే, కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ గా సింగం-3ను తెరకెక్కించాడు దర్శకుడు హరి. అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు.