చెర్రీ సినిమాలో విలన్ కోసం పోటీ...

Saturday,February 11,2017 - 09:36 by Z_CLU

వచ్చేనెల నుంచి సుకుమార్ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం జగపతి బాబును తీసుకున్నారు. ఇక విలన్ గా ఆది పినిశెట్టిని అనుకున్నారు. సరైనోడు సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న ఆది అయితే బాగుంటుందని భావించారు. కానీ ప్రస్తుతం ఆది డైరీ నిండిపోయింది. దీంతో మరో తమిళ నటుడు వైభవ్ పేరును కూడా యూనిట్ పరిశీలిస్తోంది. తాజా సమాచారం ప్రకారం…  ఆది, వైభవ్ లో ఒకర్ని సుకుమార్-చరణ్ సినిమాలో విలన్ గా తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ సినిమాకు లొకేషన్లు వెదికే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. కథ డిమాండ్ ను బట్టి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో సినిమాను షూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లొకేషన్ల వేట పూర్తయిన వెంటనే.. విలన్ ఎవరనే అంశంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరోవైపు హీరోయిన్ ను కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.