సూర్య గా మారబోతున్న బన్నీ

Sunday,June 11,2017 - 09:00 by Z_CLU

జూన్ 23 న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో థియేటర్స్ లో హంగామా చేయబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా నుంచి వక్కంతం సినిమాకు షిఫ్ట్ అవుతున్నాడు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసిన బన్నీ జులై నుంచి సినిమాను సెట్స్ పై తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడట. నిన్న మొన్నటి వరకూ ఇంకా ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది అంటూ… న్యూస్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించి లాంచ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకున్నాడు బన్నీ.

‘నా పేరు సూర్య’(నా ఇల్లు ఇండియా) అనే టైటిల్ తో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 14 పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. లగడపాటి శ్రీధర్, నాగ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకొని జులై నుంచి సెట్స్ పై కి వెళ్లనుందని సమాచారం.