జీ సినిమాలు ( ఏప్రిల్ 4th)

Monday,April 03,2017 - 10:04 by Z_CLU

నటీ నటులు : అక్కినేని నాగార్జున, శోభన

ఇతర నటీనటులు : రోజా, నాజర్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : ఉప్పలపాటి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : అక్కినేని వెంకట్

రిలీజ్ డేట్ : 18 ఫిబ్రవరి 1993

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కరియర్ లో బెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ రక్షణ. ఈ సినిమాలో శోభన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన కోట శ్రీనివాస్ రావు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్. ఉప్పలపాటి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

==============================================================================

హీరోహీరోయిన్లు – సుమన్ మాలాశ్రీ

నటీనటులు – సురేష్, మాలాశ్రీ, లక్ష్మి, శ్రీవిద్య,

సంగీతం – రాజ్ కోటి

డైరెక్టర్  – గుహనాధన్

విడుదల తేదీ – 1993

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పరువు-ప్రతిష్ట. లో-బడ్జెట్ లో తీసిన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాలాశ్రీ కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా… సుమన్ ఈ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. గుహనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 1993 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

=============================================================================

నటీనటులు : జగపతి బాబు, భూమిక చావ్లా, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మల్లికార్జున రావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కిన సినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమిక నటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

నటీ నటులు : మంచు మనోజ్, కృతి కర్బందా, సనా ఖాన్

ఇతర నటీనటులు :రాజా,  బ్రహ్మానందం, మురళి శర్మ ,రఘు బాబు,పరుచూటి వెంకటేశ్వరావు ,వెన్నెల కిషోర్, ఆహుతి ప్రసాద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువ శంకర్ రాజా

డైరెక్టర్ : అనిల్ కన్నెగంటి

నిర్మాత : డి.ఎస్.రావు

రిలీజ్ డేట్ : 8  మార్చ్ 2012

మంచు మనోజ్ సరి కొత్త ఎనర్జీ తో ఆవిష్కరించిన సినిమా ‘మిస్టర్ నూకయ్య’. అనిల్ డైరెక్షన్ లో తెరకెక్క్కిన ఈ సినిమా లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ముఖ్యంగా  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఈ సినిమాకు హైలైట్. ఈ సినిమాలో లవ్ సీన్స్, కామెడీ, పాటలు, క్లైమాక్స్ లో ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంటాయి.

==============================================================================

నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

============================================================================

నటీ నటులు : విశాల్, ప్రియమణి

ఇతర నటీనటులు : అజయ్, ఆశిష్ విద్యార్థి, దేవ రాజ్, ఊర్వశి, నిరోషా, పొన్నాంబలం

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : T. అజయ్ కుమార్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

హీరో విశాల్ కి తమిళ నాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులోనూ అంతే ఫాలోయింగ్ ఉంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించాడు. భయ్యా సినిమా తమిళంలో ‘మలాయ్ కొట్టాయ్’ గా రిలీజయింది. రెండు భాషలలోను సూపర్ హిట్టయింది.

============================================================================

హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ

నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు,  ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ

సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ

దర్శకత్వం – భరత్ పారేపల్లి

విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్  లో పేరుతెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక  స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.