రాజుగారి గది 2 సీరత్ కపూర్ ఫస్ట్ లుక్

Monday,April 03,2017 - 07:03 by Z_CLU

నాగార్జున హీరోగా ఓంకార్  డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజు గారి గది 2 మూడో షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటిస్తున్న సీరత్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

 పాండిచ్చేరిలో 20 రోజులపాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్ దాదాపు 70% షూటింగ్ ప్యాకప్ చెప్పేసింది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్, PVP సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.