బాలయ్య బాబు సినిమా కోసం భారీ సెట్

Tuesday,April 04,2017 - 11:02 by Z_CLU

బాలకృష్ణ-పూరి జగన్నాధ్ కాంబినేేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం భారీ సెట్ రెడీ అయింది. కేవలం ఈ సెట్ కోసమే దాదాపు కోటిన్నర రూపాయల వరకు ఖర్చుచేశారట. సెట్ లో భాగంగా ఒక కాలనీ, మరో మార్కెట్ నిర్మించారట. రేపట్నుంచి ఈ సెట్ లోనే బాలయ్యతో సెకెండ్ షెడ్యూల్ షురూ చేయబోతున్నాడు పూరి జగన్నాధ్.

ఇప్పటికే ముస్కాన్ అనే హీరోయిన్ ను ఎంపిక చేసిన పూరి జగన్నాధ్, తాజాగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరక్టర్ ను కూడా ఫిక్స్ చేశాడు. అనూప్ రూబెన్స్ ను కంపోజర్ గా తీసుకున్నాడు. గతంలో పూరి తో కలిసి టెంపర్, ఇజం, హార్ట్ ఎటాక్ సినిమాలకు వర్క్ చేశాడు అనూప్. ఇప్పుడు బాలయ్య సినిమా ఛాన్స్ అందుకున్నాడు.

రేపట్నుంచి 12 రోజుల పాటు బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మిగతా హీరోయిన్లను కూడా పక్కా చేసి విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.