Vakeel Saab - 2 రోజుల్లో మోత మోగిపోద్ది

Wednesday,April 07,2021 - 12:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడు. పవర్ రాక కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్ ఎదురుచూస్తోంది. కొత్త కొత్త రికార్డులు బద్దలుకొట్టాలని ఆశపడుతోంది. అందరి అంచనాల్ని అందుకుంటూ మరో 2 రోజుల్లో వకీల్ సాబ్ థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. మోత మోగడానికి మరో 48 గంటలు మాత్రమే టైమ్.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనే మేజర్ సెంటర్లలో టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఒకటి-రెండు టిక్కెట్లు కూడా మిగల్లేదంటే పవర్ స్టార్ మేనియాను అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సాయంత్రానికి మరిన్ని స్క్రీన్స్ ఓపెన్ చేసి, ఆన్ లైన్ బుకింగ్ తెరవబోతున్నారు. అవి కూడా ఓ 30 నిమిషాల్లో ఫుల్ అవ్వడం గ్యారెంటీ.

వకీల్ సాబ్ కోసం బాక్సాఫీస్ ఆశగా ఎదురుచూస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మ్యాగ్జిమమ్ థియేటర్లు ఈ సినిమాకే కేటాయించారు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి 110 స్క్రీన్స్ అందుబాటులోకి వచ్చాయి. కౌంట్ మరో 10 పెరిగే ఛాన్స్ ఉంది. అటు ఆంధ్రాలో దాదాపు 70 శాతం థియేటర్లలో వకీల్ సాబ్ హంగామా చేయబోతున్నాడు. ఎన్ని థియేటర్లు పెంచినా, స్క్రీన్ కౌంట్ పెంచినా టిక్కెట్లు మాత్రం దొరకడం లేదు.

మరోవైపు ఏపీ,నైజాంలో ఈ సినిమా బెనిఫిట్ షోలపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. మిడ్ నైట్ షోలు కష్టం కానీ, ఉదయం 7 గంటల నుంచి షోలు వేసుకునేలా స్పెషల్ పర్మిషన్ వచ్చేలా ఉంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics