జీ సినిమాలు ( 31st మార్చి )

Friday,March 30,2018 - 10:03 by Z_CLU

ఓ మై  ఫ్రెండ్

హీరో  హీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర  నటీనటులు – నవదీప్, హన్సిక,

సంగీతం – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

==============================================================================

భగీరథ

నటీనటులు : రవితేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్,

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

 

 బ్రదర్ అఫ్ బొమ్మాళి  

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

==============================================================================

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్రబేబీ యువిన, ఐశ్వర్య షిందోగిమదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ : లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన ఏళ్ల కూతురు క్రియఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియనుఆమె కూతురు క్రియనుఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు అది ప్రియనుఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియక్రియలు తప్పించుకున్నారా లేదా అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సప్తగిరి, హేమ, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి, నితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

లండన్  బాబులు 

నటీనటులు : స్వాతి, రక్షిత్

ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : కె.

డైరెక్టర్ : చిన్నికృష్ణ

ప్రొడ్యూసర్ : మారుతి

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

==============================================================================

ద మంకీ కింగ్ 2

నటీనటులు : ఆరోన్ క్వోక్గాంగ్ లీ

ఇతర నటీనటులు : ఫెంగ్ షావోఫెంగ్జియావో షేన్ యాంగ్హిమ్ లాఫెయి జియాంగ్కెల్లీ చెన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టఫర్ యంగ్

డైరెక్టర్ : చియాంగ్ పౌ సోయి

ప్రొడ్యూసర్ : కీఫర్ లియు

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2016

   ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన హాంగ్ కాంగ్ చైనీస్ ఫాంటసీయాక్షన్ ఎంటర్టైనర్  మంకీ కింగ్ 2. ‘జర్నీ టు  వెస్ట్’ నవల ఆధారంగా తెరకెక్కిన  సినిమా రిలీజైన ప్రతిచోట సంచలనం సృష్టించింది సినిమా కథ నుండి మొదలుపెడితే ప్రతి సన్నివేశం సినిమాకిహైలెట్ గా నిలిచింది.