ఎప్పటికైనా మేమే ఫస్ట్ – తమన్

Saturday,March 31,2018 - 11:13 by Z_CLU

నితిన్ ‘ఛల్ మోహన రంగ’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. సినిమాపై ఈ రేంజ్ లో క్యూరాసిటీ జెనెరేట్ అవ్వడానికి తమన్ మ్యూజిక్ కూడా కారణం అనే చెప్పాలి. సాంగ్స్ తో పాటు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో అదరగొట్టేశాడు అంటుంది సినిమా యూనిట్. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ ఈ సినిమా తనకు ఎందుకంత స్పెషలో చెప్పుకున్నాడు.

“పవన్ కళ్యాన్ గారితో ఒక సెల్ఫీ దిగినా చాలు అనుకుని కలవడానికి వెళ్తే, ఏకంగా ఈ సినిమాకి పని చేసే చాన్స్ దొరికింది. ఆయన కరియర్ లో ప్రొడ్యూసర్ గా ఇది ఫస్ట్ సినిమా. అలాంటి సినిమాలో నాకు పనిచేసే అవకాశం దొరకడం నిజంగా అదృష్టం. ఆయన ఫ్యూచర్ లో ఇంకెన్ని సినిమాలు నిర్మించినా, ఎప్పటికీ ఆయన బ్యానర్ కి మేమే ఫస్ట్ టెక్నీషియన్స్…”  అని హ్యాప్పీగా చెప్పుకున్నాడు తమన్.

కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. శ్రేష్ఠ్ మూవీస్ తో పాటు పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.