జీ సినిమాలు ( 2nd డిసెంబర్ )

Sunday,December 01,2019 - 10:03 by Z_CLU

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచుహన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబుజయప్రకాష్పోసాని కృష్ణమురళిప్రభాస్ శ్రీనుసత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీపద్మ ను ఎలా దక్కించుకున్నాడుఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడుచివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి మళ్ళీ ఎలా దగ్గరయ్యాడుఅనేది సినిమా కథాంశం.

==============================================================================

ఏ మాయ చేసావే

నటీనటులు : నాగ చైతన్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : కృష్ణుడు, దేవన్, సుధీర్ బాబు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్

ప్రొడ్యూసర్ మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్

రిలీజ్ డేట్ : 26 ఫిబ్రవరి 2010

గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య కరియర్ ట్రాక్ నే మార్చేసింది. ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయిన సమంతా, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టేసుకుంది. అంత ఇంపాక్ట్ ని చూపించింది ఈ సినిమా. అతి సాధారణ ప్రేమకథని అద్భుతంగా తెరకెక్కించాడు గౌతమ్ మీనన్. A.R. రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

అ..ఆ

నటీనటులు నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

==============================================================================

జై చిరంజీవ
నటీనటులు చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపినక్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జైచిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

=============================================================================

ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్, పూజ హెగ్డే
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రావు రమేష్, అభిమన్యు సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, సత్యదేవ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 24, డిసెంబర్ 2014
మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

యుగానికి ఒక్కడు

నటీనటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓఅమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తోతెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకిప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లోకార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.