'రీ సౌండ్' ప్రారంభం

Monday,December 02,2019 - 11:35 by Z_CLU

సాయి రామ్ శంకర్ హీరో గా రాశి సింగ్ హీరోయిన్ గా కృష్ణ చిరుమామిళ్ల దర్శకతంలో జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న  ‘రి సౌండ్ ‘ సినిమా ఇటివలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ముఖ్య అతిధులు హాజరైన స్టార్ దర్శకుడు సురేంద్ర రెడ్డి కెమెరా స్విచ్  ఆన్ చేసారు.   డైరెక్టర్ సుకుమార్ క్లాప్ ఇవ్వగా  . మొదటి షాట్ కు పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించారు.

అనంతరం పాత్రికేయుల సమావేశం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన దర్సకుడు సుకుమార్ మాట్లాడుతూ “సాయి రామ్ శంకర్ మళ్ళి  రీసౌండ్ పేరుతో వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఆల్ ది బెస్ట్ అని ” అన్నారు.

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ “ఆర్య తో దర్శకుడు సుకుమార్ మంచి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు రంగస్థలం తో రీసౌండ్ చేసాడు, అతడొక్కడే తో దర్శకుడు సురేంద్ర రెడ్డి హిట్ సౌండ్ చేసారు ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తో సైరా సినిమా తో రీసౌండ్ చేసాడు. మా సినిమా పేరు రీసౌండ్ , మంచి కథ, కొత్త గా ఉంటుంది.  హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నాం. అని కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి. అందరిని అలరిస్తుంది . మా సినిమా ప్రారంభానికి వచ్చిన  సుకుమార్ గారి కి  సురేంద్ర రెడ్డి గారికి  ధన్యవాదాలు.

నిర్మాతలు రాజా రెడ్డి మాట్లాడుతూ “రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. సాయి రామ్ శంకర్ కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. సుకుమార్ గారికి, సురేంద్ర రెడ్డి గారికి మా సినిమా ఫంక్షన్ కి వచ్చినందుకు ధన్యవాదాలు . మంచి కథ ప్రతి ప్రేక్షకుడికి నచుతుంది” అని తెలిపారు.

నటి నటులు : సాయి రామ్ శంకర్, రాశి సింగ్, అరవింద కృష్ణ, తదితరులు

కెమెరా మాన్ : సాయి ప్రకాష్

సంగీతం : స్వీకర్ అగస్తి

డైరెక్టర్ : కృష్ణ చిరుమామిళ్ల

నిర్మాతలు :  జె సురేష్ రెడ్డి, రాజు, ఎన్ వి ఎన్ రాజా రెడ్డి