జీ సినిమాలు ( 2nd మే )

Tuesday,May 01,2018 - 10:04 by Z_CLU

చంటి

హీరో హీరోయిన్లురవితేజచార్మి

ఇతర నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతంశ్రీ

దర్శకత్వంశోభన్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీఅది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

క్షేత్రం

నటీనటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

భలే దొంగలు

నటీనటులుతరుణ్, ఇలియానా

ఇతర నటీనటులుజగపతి బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, సునీల్, ఎం.ఎస్.నారాయణ  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్కె.ఎం.రాధా కృష్ణన్

నిర్మాతశాఖమూరి పాండు రంగారావు , బెల్లం కొండ సురేష్

దర్శకత్వం –  విజయ్ భాస్కర్

విడుదల తేదీ – 11  ఏప్రిల్  2008

తరుణ్-ఇలియానా లతో దర్శకుడు విజయ్ భాస్కర్ తెరకెక్కించిన లవ్ & కామెడీ ఎంటర్టైనర్ సినిమా భలే దొంగలు’. జగపతి బాబు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా లో తరుణ్-ఇలియానా మధ్య వచ్చే సీన్స్, ధర్మవరపు, సునీల్, బ్రహ్మానందం కామెడీ, రాధా కృష్ణన్ మ్యూజిక్ హైలైట్స్..

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

లండన్  బాబులు 

నటీనటులు : స్వాతి, రక్షిత్

ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కె.

డైరెక్టర్ : చిన్నికృష్ణ

ప్రొడ్యూసర్ : మారుతి

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీసూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడాఅనేది సినిమా కథాంశం.