జీ సినిమాలు ( 29th నవంబర్ )

Thursday,November 28,2019 - 10:03 by Z_CLU

అవును 2

నటీనటులు పూర్ణహర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబుసంజన గల్రానినిఖిత తుక్రాల్రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2.  సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన  సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

గోరింటాకు

నటీనటులు రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్

ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్

డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్

ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్

రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

==============================================================================

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్యరకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబుసంపత్ రాజ్వెన్నెల కిషోర్పోసాని కృష్ణ మురళిపృథ్విరాజ్చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో  పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని  గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.

=============================================================================

యోగి
నటీనటులు : ప్రభాస్నయన తార
ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావుప్రదీప్ రావత్సుబ్బరాజుఆలీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల
డైరెక్టర్ : V.V. వినాయక్
ప్రొడ్యూసర్ రవీంద్ర నాథ్ రెడ్డి
రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

దేవదాస్

నటీనటులు : నాగార్జున అక్కినేనినానిరష్మిక మండన్నఆకాంక్ష సింగ్ 

ఇతర నటీనటులు : R. శరత్ కుమార్కునాల్ కపూర్నవీన్ చంద్రనరేష్సత్య కృష్ణన్మురళీ శర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2018

దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. ఓ గొడవ కారణంగా హైదరాబాద్ వచ్చిన దేవకు ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయం అవుతుంది. పోలీసుల నుంచి తప్పించుకొని దాస్ క్లినిక్ కు చేరుకుంటాడు. గాయంతో వచ్చిన దేవాను దాస్ ఆదుకుంటాడు. దాస్ మంచి మనసుకు దేవ కూడా ఫిదా అవుతాడు. అలా ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు.

మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికిదాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. అదే సమయంలో దాస్ చెప్పిన మాటలు దేవాను మార్చేస్తాయి. ఫైనల్ గా దాస్దేవ కలిశారా లేదా..విలన్లుపోలీసులు ఏమయ్యారుమధ్యలో రష్మికఆకాంక్షల స్టోరీ ఏంటిఇది తెలియాలంటే దేవదాస్ చూడాల్సిందే.

==============================================================================

శివాజీ

నటీనటులు రజినీకాంత్శ్రియ శరన్

ఇతర నటీనటులు : వివేక్సుమన్రఘువరన్మణివన్నన్వడివుక్కరసికోచిన్ హనీఫా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : S.శంకర్

ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్

రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్యవైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..లేదా..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.