విజయ్ ఆంటోనీ నుంచి మరో మూవీ

Thursday,November 28,2019 - 06:47 by Z_CLU

‘బిచ్చగాడు’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్‌ ఆంటోనీ. కంటెంట్‌ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇదే వరసలో విజయ్‌ ఆంటోనీ, అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’. ఈ సినిమాను తెలుగులో ‘జ్వాల’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు.

దాదాపు 25 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. తొలి షెడ్యూల్‌ను చెన్నై, కోల్‌కత్తా వంటి లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాతి షెడ్యూల్‌ను మాస్కో, రష్యా వంటి దేశాల్లో షూట్‌ చేశారు. రీసెంట్ గా కజకిస్తాన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్‌ చేస్తున్నారు. కజికిస్థాన్ లో షూటింగ్ జరుపుకున్న తొలి ఇండియన్ మూవీ ఇదేనంటోంది యూనిట్.

సినిమాలో యాక్షన్‌ సన్నివేశాల్ని మూవీ లవర్స్‌ విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారని అంటోంది యూనిట్. రైమా సేన్, ప్రకాశ్‌ రాజ్, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నటరాజన్‌ శంకరన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో రామాంజనేయులు, రాజశేఖర్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.