జీ సినిమాలు ( 25th ఫిబ్రవరి)

Monday,February 24,2020 - 10:00 by Z_CLU

ఆనందో బ్రహ్మ

నటీనటులు : తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్
ఇతర నటీనటులు : షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్ : K .
డైరెక్టర్ : మహి V . రాఘవ్
ప్రొడ్యూసర్ : విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి
రిలీజ్ డేట్ : 10 ఆగష్టు 2017

ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో ఓ వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఆ ఇంటిని ఓ రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. ఈ క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఆ ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని ఈ నలుగురు ఏ విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

____________________________________

_________________________________________

కథానాయకుడు

నటీనటులు రజినీ కాంత్జగపతి బాబుమీనానయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్ప్రభువిజయ్ కుమార్బ్రహ్మానందంఆలీసునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కిఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

_______________________________________________

సైజ్ జీరో

నటీనటులు : అనుష్క శెట్టిఆర్య
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఊర్వశిసోనాల్ చౌహాన్అడివి శేష్బ్రహ్మానందంగొల్లపూడి మారుతి రావుతనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015

అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసంఅతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

____________________________________________________

హైపర్

నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016

వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

___________________________________________

మోహిని

నటీనటులు త్రిషజాకీ భజ్ఞాని
ఇతర నటీనటులు : ముకేష్ తివారీపూర్ణిమ భాగ్యరాజ్యోగి బాబుజాంగిరి మధుమితజ్ఞానేశ్వర్స్వామినాథన్ మరియు తదితరలు
మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ – మెర్విన్
డైరెక్టర్ : రమణ మాదేశ్
ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్
రిలీజ్ డేట్ : 27 జూలై 2018

ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.
సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది. గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.