శ్యామ్ సింగరాయ్ గా నాని

Monday,February 24,2020 - 06:09 by Z_CLU

నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమా పేరు శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలాతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ ప్రాజెక్ట్ ను డైరక్ట్ చేయబోతున్నాడు.

సినిమా ఎనౌన్స్ మెంట్ కు సంబంధించి రిలీజ్ చేసిన వీడియో చాలా డిఫరెంట్ గా ఉంది. పాతకాలం నాటి టైపు మెషీన్ పై హీరో, డైరక్టర్, ప్రొడ్యూసర్ల పేర్లను టైపు చేస్తూ సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేశారు. థీమ్ చూస్తుంటే.. ఈ సినిమా ఓ 40 ఏళ్ల కిందటి పీరియాడిక్ మూవీలా అనిపిస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. సర్ ప్రైజ్ ఏంటంటే.. సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిసెంబర్ 25న శ్యామ్ సింగరాయ్ థియేటర్లలోకి రాబోతున్నాడు. టక్ జగదీశ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు నాని.