జీ సినిమాలు ( 23rd డిసెంబర్ )

Saturday,December 22,2018 - 10:06 by Z_CLU

ధీరుడు
నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్
ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : భూపతి పాండ్యన్
ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్
రిలీజ్ డేట్ : 26 జూలై 2013
సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

చిరుత
నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.

==============================================================================

అన్నవరం
నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్
ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

రాఖీ
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006
NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు : వెంకటేష్, త్రిష
ఇతర నటీనటులు : శ్రీకాంత్, K. విశ్వనాథ్, కోట శ్రీనివాస రావు, స్వాతి రెడ్డి, సునీల్, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై  ఎండ్   ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

==============================================================================

కోకోకోకిల

నటీనటులు : నయనతార, యోగిబాబు
ఇతర నటీనటులు : శరణ్య పొన్ వన్నన్, హరీష్ పేరడి, R.S. శివాజీ, చార్లెస్ వినోత్, శరవణన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్
డైరెక్టర్ : నెల్సన్ దిలీప్ కుమార్
ప్రొడ్యూసర్ : అల్లిరాజా సుభాస్కరన్
రిలీజ్ డేట్ : 17 ఆగష్టు 2018
నాయుడుపేటలో ఓ పేద కుటుంబం. ఆ కుటుంబానికి కోకిలే దిక్కు. ఆమె జీతంపైనే కుటుంబం నెట్టుకొస్తున్న టైమ్ లో హఠాత్తుగా కోకిల తల్లికి ఊపిరితిత్తుల కాన్సర్ అని తెలుస్తుంది. ట్రీట్ మెంట్ కు కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు కోసం ప్రయత్నిస్తున్న టైమ్ లో అనుకోకుండా ఓ మాదక ద్రవ్యాల ముఠా, కోకిలకు పరిచయమౌతుంది. అలా డ్రగ్స్ సరఫరా చేసే అమ్మాయిగా మారుతుంది.

కానీ పోలీసులకు విషయం తెలిసిపోతుంది. మాఫియాలోనే ఓ వ్యక్తి పోలీసులకు లీక్ చేస్తాడు. మరోవైపు అనుకోని పరిస్థితుల మధ్య డ్రగ్స్ మాఫియా నాయకుల్లో ఒకడ్ని కోకిల చంపేస్తుంది. ఓవైపు పోలీసులు, మరోవైపు మాఫియా.. వీళ్ల నుంచి కోకిల ఎలా తప్పించుకుంది. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనేది కథ.